బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓటర్లను కోరారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి వీజీ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు. హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు.


