మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం

Feb 7 2026 10:12 AM | Updated on Feb 7 2026 10:12 AM

మున్స

మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం

మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం మున్సిపల్‌ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుంద మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని, ప్రచారంలో ప్రజలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే అన్నారు. శుక్రవారం 3వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 12 వార్డులు బీఆర్‌ఎస్‌ గెలువబోతోందని జోస్యం చెప్పారు. నాల్చర్‌ శిరీష కుటుంబ పెద్దలు 50 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నారని, వారి వారసురాలిగా నాల్చర్‌ శిరీష బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకులను ఓటర్లు నమ్మవద్దని, నెరవేర్చని హామీలు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు.

మేనిఫెస్టో భగవద్గీతతో సమానం: శిరీష

3వ వార్డు కోసం తయారు చేసిన ప్రత్యేక మేనిఫెస్టో భగవద్గీతతో సమానమని, వంద శాతం అమలు చేసి తీరుతామని బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నాల్చర్‌ శిరీష అన్నారు. వార్డులో ప్రచారం చేస్తూ కార్డు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నానని అన్నారు.

ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం 11వ వార్డులో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌ అభ్యర్ధి భాగ్యలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని, పాలక వర్గం కొలువుదీరిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి రూ.60 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మవద్దని కోరారు. చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు.

మున్సిపాలిటీలో  బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం 1
1/1

మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement