‘మార్చిలోగా బకాయిలు చెల్లించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘మార్చిలోగా బకాయిలు చెల్లించాలి’

Feb 10 2026 7:25 AM | Updated on Feb 10 2026 7:25 AM

‘మార్చిలోగా బకాయిలు చెల్లించాలి’

‘మార్చిలోగా బకాయిలు చెల్లించాలి’

కామారెడ్డి అర్బన్‌: ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్‌ బిల్లులను మార్చిలోగా ఒకే విడతలో చెల్లించకపోతే ఉద్యమిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి పీఆర్‌టీయూ భవన్‌ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జిల్లాలోని 81 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లోవిజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, భిక్షంగౌడ్‌, జిల్లా అధ్యక్షుడు కుషాల్‌, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement