రక్తదానం ప్రాణదానంతో సమానం
కామారెడ్డి క్రైం: రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలోని యూనియన్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. శిబిరంలో 153 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రతినిధులు మధుసూధన్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి మంగళవారం ఉదయం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలో ఏఎంసీ గోడౌన్ (ఎస్పీ ఆఫీస్ దగ్గర), బాన్సువాడలో ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బిచ్కుందలో మార్కెట్ యార్డ్‌లలో సామగ్రి పంపిణి కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఉదయం 8 గంటలకు చేరుకోవాలని సూచించారు.
కామారెడ్డి క్రైం : ‘సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు – కేవైసీ’ అనే నినాదంతో 13 వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవా లను నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ కేవైసీ సంబంధిత మోసాలను నివారించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజ ల్లో ఈ–కేవైసీ, సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికి ‘ఒక బ్యాంకు శాఖ–ఒక గ్రామసభ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం చంద్రశేఖర్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు వినోద్, రాకేష్ కుమా ర్, సుజిత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ: రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికై నట్లు ఆర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. సోమవారం దోమకొండ గడికోటలో సీఎం కప్ ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ కుమార్ సహకారంతో ఈ పోటీలను దోమకొండలో నిర్వహించినట్లు ఆర్చరీ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిర్మల్‌గౌడ్ తెలిపారు. బాలికల విభాగం(30 మీటర్లు)లో సహస్ర, బాలుర విభాగంలో ఎస్‌కే. రెహన్ ఎంపికయ్యారు. అదేవిధంగా బాలిక విభాగం(40 మీటర్లు)లో ఎన్.భావన, బాలుర విభాగంలో పీఆర్ రామచరణ్ ఎంపికయ్యారు. రికర్వ్ రౌండ్‌లో బాలికల విభాగంలో బి.వర్షిణి, పి.నక్షత్ర, బాలుర విభాగంలో నవీన్, ఎస్.స్నేహిత్‌లు ఎంపికయ్యారు. కాంపౌండ్ రౌండ్ 50 మీటర్లలో శ్రీ వైష్ణవి ఎంపికయ్యా రని కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. గ్రామ స ర్పంచ్ ఐరేని నర్సయ్య, పీడీ నరసింహారెడ్డి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, మార్కెట్ కమి టీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు మర్రి శేఖ ర్, సిద్ధ రాములు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. నిబంధనల ప్రకారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు కేంద్రాలను కేటాయించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సీపీవో రఘునందన్, అధికారులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


