ఉమ్మడి జిల్లా ఐకేపీ సీసీలకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఐకేపీ సీసీలకు శిక్షణ

Feb 15 2026 6:54 AM | Updated on Feb 15 2026 6:54 AM

ఉమ్మడి జిల్లా ఐకేపీ సీసీలకు శిక్షణ

ఉమ్మడి జిల్లా ఐకేపీ సీసీలకు శిక్షణ

ఎస్‌హెచ్‌జీలకు ఆర్థిక

రుణ చేకూర్పు అంశాలపై...

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు (సీసీలు) సెర్ప్‌ అధికారులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని న్యాక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జరుగుతున్న ఈ శిక్షణకు బ్యాచ్‌ల వారీగా ఓరియంటేషన్‌ ఇస్తున్నారు. ఆర్థిక రుణ చేకూర్పు అనే అంశాలపై ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ రుణాలు, రికవరీ, ఆర్థికాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు, పెట్టుబడులు తెలుసుకునేందుకు సీసీలకు కూలంకషంగా చెప్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో వీవోఏల ద్వారా మహిళా సంఘాల వరకు తీసుకెళ్తారు. శిక్షణ పొందిన సీసీలకు డీఆర్‌డీవో సాయాగౌడ్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 277 మందికి ఈ నెల 17 వరకు శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఏపీఎంలు కూడా ఇవే అంశాలపై ఇటీవల రాష్ట్రస్థాయిలో శిక్షణ పొంది వచ్చినట్లు డీఆర్డీవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement