సంక్షిప్తం..
గ్రామంలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. మాల్తుమ్మెద గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని, నర్సరీని.. ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను నెమ్మదిగా కొనసాగిస్తున్న లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శి అశోక్‌ను ఆదేశించారు.
సృజనాత్మకతకు కళలు మూలం
మద్నూర్(జుక్కల్):సృజనాత్మకతకు కళలు మూల మని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అ న్నారు. ముంబై రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ ఫర్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు వేసిన వివిధ వర్ణచిత్రాలను సోమవా రం ఆవిష్కరించారు. వివిధ రకాల చిత్రాలు వేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రముఖ పద్యకవి, చిత్రకారుడు వెంకట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. సోమవారం ఆయన అయ్యపల్లి తండా అంగన్‌వాడి, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల హా జరు,పాఠశాలనిర్వాహణరికార్డులను పరిశీలించారు.
చిన్నటాక్లీలో..
మద్నూర్(జుక్కల్): అంగన్‌వాడిలోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మద్నూర్ ప్రాజెక్ట్ సీడీపీవో కళావతి సూచించారు. డోంగ్లీ మండలంలోని చిన్న టాక్లీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడి టీచర్లు సమయపాలన పాటించి.. నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు విద్యను అందించాలన్నారు. సూపర్‌వైజర్ సచిత ఉన్నారు.
ఉపాధి పనులు ప్రారంభం
లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు, నల్లమడుగు తండాల శివారులో సోమవారం సర్పంచులు ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూలీలు సమయపాలన పాటించి కొలతల ప్రకారం పనులు చేయాలని సూచించారు. సర్పంచ్ దేవసోత్ కవిత, క్షేత్రసహాయకులు, మేట్లు పాల్గొన్నారు.
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి):అర్హులైన నిరుపేదలందరి కి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్నట్లు స ర్పంచ్ లాల్‌సింగ్, ఉప సర్పంచ్ రమేశ్‌రెడ్డి పేర్కొ న్నారు.సోమవారం తిర్మన్‌పల్లిలో ఇందిరమ్మ గృహా ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి ఇంతియాజుద్దిన్, నాయకులు కావేటి సాయిలు, పెద్దొల్ల సాయిలు పాల్గొన్నారు.


