దోపిడీని అడ్డుకుంటేనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

దోపిడీని అడ్డుకుంటేనే అభివృద్ధి

Feb 8 2026 4:15 AM | Updated on Feb 8 2026 4:15 AM

దోపిడీని అడ్డుకుంటేనే అభివృద్ధి

దోపిడీని అడ్డుకుంటేనే అభివృద్ధి

బీజేపీకి అవకాశమిస్తే

ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తా

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే

కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్‌ : మున్సిపాలిటీలో దోపిడీని అడ్డుకుంటేనే ఉన్న నిధులతో సక్రమంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే వెంకటరమణారె డ్డి పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలలో లక్షల రూ పాయలు ఖర్చు చేస్తూ, చైర్‌పర్సన్‌ పీఠం కోసం కో ట్లాది రూపాయలు ముట్టజెప్పి అధికారంలోకి వచ్చే వారు.. ఆ తర్వాత ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఘటనలే జరిగాయని, ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే వా ర్డులన్నింటినీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కామారె డ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తానని హామీ ఇ చ్చారు. ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేని అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాకే నియోజకవర్గంలో కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు, బెదిరింపులు తగ్గా యని ఆయన గుర్తుచేశారు. గతంలో ఏ పార్టీ పాలించినా అందరూ కలిసికట్టుగా దోచుకున్నారని విమర్శించారు. మున్సిపల్‌ ఆదాయ మార్గాలను పెంచుకుని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేసి చూపిస్తా నని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్‌ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కా కుండా కేవలం అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమాలలో బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement