ఘనంగా ఉత్సవాలు ప్రారంభం
గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం
● బిచ్కుందలోని సద్గురు బస్వలింగప్ప స్వామి మఠానికి 1058 ఏళ్ల చరిత్ర
● మూడు రెండు రోజుల పాటు..
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని ప్రాచీన సద్గురు బస్వలింగప్ప స్వామి మఠం శివభక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా మారి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. మూడు రోజులు కొనసాగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు ప్రతీ ఏటా వేలాది మంది భక్తులు వస్తున్నారు. అంగరంగ వైభవంగా కొనసాగనున్న ఉత్సవాలకు మఠం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి స్టేజ్‌ను కై లాస పర్వతంగా అలంకరించారు. 17 వరకు ఉత్సవాలు జరగనున్నాయి మఠం పీఠాధిపతిసోమలింగ శివాచార్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం, మహారుద్రాభిషేకం, రథోత్సవం, లింగదీక్ష పూజలు, అన్నదానం చేపట్టనున్నారు.
968లో సంస్థాన్ స్థాపన..
దక్షిణ కాశీగా పిలువబడే సద్గురు బస్వలింగప్ప స్వామి మఠం సంస్థాన్, శివాలయానికి పెద్ద చరిత్ర ఉంది. 968వ సంవత్సరంలో ఈ మఠం కొలువుదీరింది. నేటికి 1,058 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆనాడు సంస్థాన్ పీఠానికి మూల పురుషుడు గురులింగప్ప పట్టాచార్యమూర్తి 968వ సంవత్సరంలో ప్రథమ ఫీఠాధిపతిగా ఉన్నారు. రెండో పీఠాధిపతి వీర బస్వయ్యప్ప పట్టాచార్యమూర్తి. నేడు 30వ పీఠాధిపతిగా సోమలింగ శివాచార్య స్వామి కొనసాగుతున్నారు. బిచ్కుంద, బాన్సువాడ బోర్లం గుట్ట శివాలయం, నారాయణ్‌ఖేడ్ బోరంచ గ్రామంలో నల్లపోచమ్మ దేవాలయం, సికింద్రాబాద్‌లో శంకర్ మఠం్, శివాలయ దేవస్థానాలు వెయ్యి ఏళ్ల నుంచి బిచ్కుంద మఠం్ సంస్థాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
నేడు రథోత్సవం..
ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల పాటు అంగరంగా వైభవంగా జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు శివ పార్వతుల కల్యాణ మహోత్సవం, రుద్రాభిషేకం, భక్తి సాంస్కృతిక, దీక్ష కార్యక్రమాలు, సోమవారం అంగరంగ వైభవంగా రథోత్సవం, అన్నదానం, దీపాల అలంకరణ, మంగళవారం లక్ష బిల్వార్చన, కుస్తీపోటీలు, తీర్ధప్రసాదాలతో ఉత్సవాల ముగింపు ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల నుంచి లక్షల మంది భక్తులు బిచ్కుంద మఠం సంస్థాన్, శివాలయ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
అంగరంగా వైభవంగా మూడు రోజులు మఠంలో మహా శివరాత్రి, జాతర ఉత్సవాలు 1,054 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ మఠం స్థాపన జరిగి వెయ్యేళ్లు అయినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. నేను 30వ పీఠాధిపతిగా కొనసాగుతున్నాను. ఈ మఠం అత్యంత పవిత్రంగా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. భక్తులు అందరు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి.
– సద్గురు సోమలింగ శివాచార్య స్వామి, బస్వలింగప్ప స్వామి మఠం పీఠాధిపతి, బిచ్కుంద


