క్యాంపు రాజకీయాలు షురూ.. | - | Sakshi
Sakshi News home page

క్యాంపు రాజకీయాలు షురూ..

Feb 14 2026 8:08 AM | Updated on Feb 14 2026 8:08 AM

క్యాం

క్యాంపు రాజకీయాలు షురూ..

ఎల్లారెడ్డి – 12

16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

ఎల్లారెడ్డి – 12
10

కౌన్సిలర్లను తరలించిన పార్టీలు

కామారెడ్డి కాంగ్రెస్‌

శిబిరంలోకి స్వతంత్రులు!

01

కాంగ్రెస్‌

స్వతంత్ర

బీఆర్‌ఎస్‌

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కోసం ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను శిబిరాలకు తరలించాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆయా రాజకీయ పార్టీలు కౌన్సిలర్లందరినీ క్యాంపులకు తీసుకువెళ్లాయి. కామారెడ్డి బల్దియాకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 19 మంది ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని కలిశారు. ముగ్గురు ఇండిపెండెంట్లు సైతం కాంగ్రెస్‌ శిబిరంలో చేరినట్లు తెలిసింది. వారంతా కలిసి క్యాంప్‌నకు వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లతో సమావేశమైన స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. వారిని క్యాంపునకు తరలించారు. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలలో కీలకంగా మారిన బీఆర్‌ఎస్‌ సైతం జాగ్రత్త పడుతోంది. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు.

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక విషయంలో పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. చైర్మన్‌ పదవిని పద్మ శ్రీకాంత్‌తో పాటు భాగ్యవతి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పార్టీ తరఫున ఎన్నికై నవారినందరినీ క్యాంపునకు తరలించారు.

బాన్సువాడలో 19 వార్డులకుగాను కాంగ్రెస్‌ 11 చోట్ల గెలిచింది. ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డిల ఆధ్వర్యంలో వీరంతా క్యాంపునకు వెళ్లారు. బిచ్కుంద మున్సిపాలిటీలో 10 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లను ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు క్యాంపునకు తీసుకువెళ్లారు.

10

నూతన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారంతో పాటు చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక కోసం ఈనెల 16న ఆయా బల్దియాలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. ఈలోపు ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై క్యాంపుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఏకాభిప్రాయం, మద్దతు లభించని పక్షంలో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంటుంది.

క్యాంపు రాజకీయాలు షురూ..1
1/1

క్యాంపు రాజకీయాలు షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement