ప్రజావ్యతిరేక విధానాలను వీడాలి
పిట్లం(జుక్కల్): ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పిట్లం ఏఎంసీలోని గోదాం ముందు గురువారం హమాలీలు సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బుర్రెం బాల్‌రాజ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. కార్మిక ప్రజా వ్యతిరేకత విధానాలను విడనాడాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను సవరణ చేస్తూ 4 లేబర్ కోడ్‌లుగా మార్చడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వమే కార్మికులకు జీతాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మకాలు ఆపాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అసంఘటిత రంగ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోకపోతే ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామన్నారు. హమాలీలు శ్రీనివాస్. రాజేష్, పీరయ్య. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


