కామారెడ్డి ‘పురం’ ఎవరి పరమో?
విలక్షణ తీర్పు..
కామారెడ్డిలో మూడు పార్టీలు సాధించిన ఓట్లు, సీట్ల వివరాలు..
కామారెడ్డి ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ప్రధాన పార్టీలను అన్నింటిని ఆదరించిన ఓటర్లు.. ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా చిక్కుముడి వేశారు. ఏవైనా రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితిని సృష్టించారు. దీంతో ఏ రెండు పార్టీలు కలుస్తాయన్న అంశంపై పట్టణంలో జోరుగా చర్చ నడుస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలవగా.. బీజేపీ 16 వార్డుల్లో బీఆర్‌ఎస్ 11 వార్డుల్లో గెలుపొందాయి. మరో మూడు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. కాగా చైర్‌పర్సన్ పదవి దక్కాలంటే 25 స్థానాలు అవసరం. అయితే ఏ ఒక్క పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోకపోవడంతో బల్దియా పీఠం చేజిక్కించుకోవడంతో అన్ని పార్టీలకు పరీక్షగా మారింది.
కింగ్‌మేకర్ బీఆర్‌ఎస్?
కాంగ్రెస్ పార్టీ 19 వార్డులను గెలుచుకుంది. చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆ పార్టీకి మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం. ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చినా సరిపోదు. 16 స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో ఉన్న బీజేపీకి చైర్‌పర్సన్ పీఠం దక్కాలంటే మరో తొమ్మిది మంది మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో 11 స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్ కింగ్ మేకర్ కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో యుద్ధం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డిలో ఆ పార్టీకి మద్దతు ఇస్తుందా, లేక 16 స్థానాలు గెలిచిన బీజేపీ వైపు నిలుస్తుందా అన్న అంశంపై చర్చ నడుస్తోంది.
2020లోనూ హంగే!
2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికలలో బీఆర్‌ఎస్ 23 వార్డులలో గెలుపొందగా.. కాంగ్రెస్ 12, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. మరో ఆరు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. అయితే స్వతంత్రులను కలుపుకుని బల్దియాపై బీఆర్‌ఎస్ జెండా ఎగరేసింది. తర్వాతి కాలంలో పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి బల్దియా చైర్మన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం పెట్టి పదవినుంచి దింపేశారు. వైస్ చైర్మన్‌గా ఉన్న ఇందుప్రియ కాంగ్రెస్‌లో చేరి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గెలుపు..
33వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి కుంబాల రవియాదవ్, బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డిలకు 472 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నాలుగు బీజేపీ అభ్యర్థికి రావడంతో ఆయన నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు విలక్షణ తీ ర్పు ఇచ్చారు. అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సొంతంగా బల్దియాను కై వసం చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. గత కౌ న్సిల్‌లో ఎనిమిది సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి తన బలాన్ని 16 కు పెంచుకున్నా మ్యా జిక్ ఫిగర్‌కు దూరంగానే ఉండిపోయింది. కాగా గత ఎన్నికలలో గెలిచి బల్దియాను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌కు ఈసారి 12 స్థానాలు తగ్గినప్పటికీ.. చైర్‌పర్సన్ ఎన్నికలలో కీలకంగా మారింది.
పార్టీ సాధించిన ఓట్లు గెలిచిన సీట్లు
కాంగ్రెస్ 21,598 19
బీజేపీ 18,571 16
బీఆర్‌ఎస్ 17,069 11
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డిలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో చైర్‌పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. కామారెడ్డి చైర్‌పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తే చైర్‌పర్సన్ కావాలని చాలామంది ఆశించారు. 9వ వార్డు నుంచి పోటీ చేసిన ఉర్దొండ వనిత, 35 వ వార్డు నుంచి పోటీ చేసిన నిట్టు వినోద, 19వ వార్డు నుంచి పోటీ చేసిన గుడుగుల సవిత, 10వ వార్డు నుంచి పోటీ చేసిన నీలం కలావతి, 31వ వార్డు నుంచి పోటీ చేసిన పాక జ్ఞానేశ్వరి, 34 వ వార్డు నుంచి పోటీ చేసిన పాండ్రె మమత, 16వ వార్డు నుంచి బరిలో ఉన్న దీక్షిత చైర్‌పర్సన్ పీఠాన్ని ఆశించినా.. వారు ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 15వ వార్డు నుంచి రెండో పర్యాయం విజయం సాధించిన సురోజ్ వనిత, 14 వ వార్డు నుంచి గెలుపొందిన పిన్న వయస్సురాలైన రాంశెట్టి హర్షిత, రెండోపర్యాయం విజయం సాధించిన తాటి లావణ్య పేర్లు చైర్మన్ పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ వర్గానికి చెందిన ఏడుగురు మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో ఎవరికై నా అవకాశం ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు. అయితే కాంగ్రెస్‌లో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఇప్ప ఉమారాణికి పదవి దక్కవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజేపీనుంచి..
బీజేపీకి అవకాశం దక్కితే ఆ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య తక్కువేం లేదు. 34 వ వార్డు నుంచి రెండోసారి విజయం సాధించిన ఉన్నత విద్యావంతురాలైన గాండ్ల సుజిత రేసులో ఉన్నారు. 42వ వార్డు నుంచి గెలిచిన పెద్దబోయిన స్వప్న, 35వ వార్డు నుంచి గెలిచిన భోజన్నగారి వినోద, 11వ వార్డు నుంచి గెలిచిన కాసర్ల రాణి, 16వ వార్డు నుంచి గెలిచిన యాడవరం ప్రియాంకలు సైతం పదవిని ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో బీసీ మహిళా కౌన్సిలర్లు కాసర్ల గోదావరి, గోపు బాలమణి, గెరిగంటి స్వప్న తదితరులు చైర్‌పర్సన్ రేసులో ఉంటారని తెలుస్తోంది.
పార్టీలకు పరీక్ష పెట్టిన ఓటరు
మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా అన్ని పార్టీలు
19 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్
పదహారు సీట్లతో సత్తా చాటిన బీజేపీ
కీలకంగా మారిన బీఆర్‌ఎస్


