బాన్సువాడ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ! | - | Sakshi
Sakshi News home page

బాన్సువాడ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ!

Feb 14 2026 8:08 AM | Updated on Feb 14 2026 8:08 AM

బాన్సువాడ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ!

బాన్సువాడ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ!

బాన్సువాడ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ!

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ ఎన్నిక లాంఛనం కానుంది. ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌ సతీమణి విజయ గెలిస్తే చైర్‌పర్సన్‌ అవుతారని ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. బల్దియాలో 19 వార్డులుండగా కాంగ్రెస్‌ 11 స్థానాల్లో గెలిచింది. దీంతో చైర్‌పర్సన్‌గా ఆమె ఎన్నిక లాంఛనమేనని భావిస్తున్నారు. కాగా వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎవరిని నియమిస్తారన్న అంశంపై పట్టణంలో చర్చ నడుస్తోంది. గతంలో బాన్సువాడ పంచాయతీగా ఉన్నప్పుడు ఎవరు సర్పంచ్‌గా గెలిచినా ఉప సర్పంచ్‌ పదవి మాత్రం మైనారిటీలకు ఇచ్చేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైస్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని మైనారిటీలకు ఇచ్చే అవకాశాలున్నాయి. 18వ వార్డునుంచి గెలిచిన మాజీ ఎంపీపీ రేష్మబేగంతోపాటు 13వ వార్డులో విజయం సాధించిన అబ్దుల్‌ ఖలేక్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement