రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు.. జాతీయ సైన్స్‌ఫెయిర్‌కు కల్వరాల్‌ విద్యార్థుల.. సైబర్‌ మోసాలపై అవగాహన

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటహైస్కూ ల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై నట్లు పీడీ సభాత్‌ కృష్ణ గురువారం తెలిపారు. హైస్కూల్‌కు చెందిన నీలిమ, పవిత్ర బాలికల విభాగంలో, మనోహార్‌, ఆంజనేయులు బాలుర విభాగంలో సీఎం కప్‌ జిల్లా స్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో ఉత్తమప్రతిభ కనబర్చారని ఆయన చెప్పారు. విద్యార్థులను హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డితోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

మద్నూర్‌(జుక్కల్‌): మండల కేంద్రానికి చెందిన కస్తూర్భా పాఠశాలకు చెందిన విద్యార్థినులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్స్‌పాల్‌ సత్యశీల గురువారం తెలిపారు. అలాగే కరాటే పోటీల్లో కస్తూర్భా పాఠశాలకు చెందిన సంధ్య జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిందని ఆమె వెల్లడించారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): కల్వరాల్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అగస్త్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘జిజ్ఞాస సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన ప్రసన్న, స్నేహలు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 17, 18వ తేదీలలో జాతీయ సైన్స్‌ ఫెయిర్‌.. పూణెలో జరుగనున్నాయన్నారు. పాల్గొనడానికి అవసరమైన ట్రైన్‌ టికెట్‌తో పాటు రూ.6వేల ఆర్థిక సహాయాన్ని హెచ్‌ఎం విష్ణువర్ధన్‌ రెడ్డి, సైన్స్‌ ఉపాధ్యాయుడు రాజేందర్‌, పూర్ణారావులు అందించారు. విద్యార్థులను డీఈవో రాజు, ఎంఈవో యోసెఫ్‌ అభినందించారు. వీడీసీ చైర్మన్‌ రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్‌

పరీక్షా కేంద్రం తనిఖీ

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల బీటెక్‌ (సీఎస్‌ఈ, ఏఐ) మొదటి సెమిస్టర్‌ పరీక్షలు గురువారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పరీక్షలకు 71 మందికి 71 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే సంపత్‌కుమార్‌తో కలిసి ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు.

నిజామాబాద్‌ అర్బన్‌: సైబర్‌ మోసాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం కాకతీయ జూనియర్‌ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. సెబర్‌ క్రైమ్‌ ఏసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందడంతో పాటు, సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధిక లాభాలు వస్తాయని నమ్మబలికే నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పి ప్రజల డబ్బును దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థపై పూర్తి వివరాలు సేకరించాలని, అపరిచిత కాల్స్‌ను నమ్మకూడదని సూచించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
1
1/2

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
2
2/2

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement