breaking news
python body
-
భారీ కొండచిలువపై జారుడు బండ ఆట, వైరల్ వీడియో
పిల్లలు 20 అడుగుల భారీ కొండచిలువ (Python)పై జారుడు బండ ఆడుకుంటున్న వీడియె నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వింత ఘటన ఇండోనేషియాకి చెందినదిగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిగ్భ్రాంతికరమైన ప్రకారం సజీవంగా ఉన్న ఒక పెద్ద కొండచిలువపైకి ఎక్కి దానిపై నుంచి జారుతూ ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాదు పిల్లలు అంత ప్రమాదకరమైన జీవితో ఆడుకుంటున్నా, అక్కడ ఉన్న పెద్దలు వారిని వారించకపోగా తమ స్మార్ట్ఫోన్లలో వీడియోలు తీస్తూ శాంతంగా చూస్తుండిపోవడం కొంతమంది బనెటిజనులను ఆశ్చర్యపరిచింది.నెటిజన్ల స్పందనఅయితే ఇండోనేషియాలో అవి చాలా చౌకగా దొరుకుతాయనీ, వాటి లివర్ నూనె కోసం వేటాడతారని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. 90వ దశకంలో 5 అడుగుల పిల్ల పాము ధర సుమారు 5 డాలర్లు అని కూడా చెప్పారు. వీటిని రెటిక్యులేటెడ్ కొండచిలువ (Reticulated Python) అంటారట. ఇవి విషపూరితమైనవి కావు, కానీ ఇవి తమ బలమైన కండరాల శక్తితో ఎరను చుట్టి నలిపి మింగేయగలవు. కానీ అడవిలో ఉండేవి చాలా దూకుడుగా ఉంటాయి మరియు బెదిరిస్తే వెంటనే కాటు వేస్తాయి.ఈ వీడియో దాదాపు 1,60,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.😱 Kids turn a giant python into a playground slide In Indonesia, children turned an enormous snake into their own amusement park ride — sliding down its body, sitting on top of it, and running around it. All while adults calmly stood nearby, filming with their phones. Judging by the footage, it's a reticulated python — one of the largest and most dangerous snakes in the world. It's not venomous, but it can constrict and even swallow an adult human. The scariest part of this video isn't even the giant snake — it's that nobody around seems remotely concerned.— NEXTA (@nexta_tv) November 9, 2026 పిల్లలు ఇళ్లల్లో ఫోన్లకు అతుక్కుపోకుండా బయట ఆడుకుంటున్నారని ఒకరంటే, ఇండోనేషియాలో ఇవి సాధారణం, క్రమం తప్పకుండా మానవ స్పర్శకు అలవాటు పడినవి లేదా ఆహారం తిన్న తర్వాత ఉండే పాములు చాలా శాంతంగా ఉంటాయని మరికొందరు పేర్కొన్నారు. వన్యప్రాణి ప్రేమికుల ఆందోళన: సాధారణ ప్రజలు దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ, వన్యప్రాణి నిపుణులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు. క్రూరమైన, ఎలాంటి శిక్షణ లేని వన్యప్రాణులతో పిల్లలు ఇలా ఆటలాడుకోవడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. -
కొండచిలువ కళేబరంతో ఆందోళన
చండ్రుగొండ: రైతుకు కోపం వచ్చింది. అర్ధ రాత్రి వేళ వ్యవసాయానికి కరెంటు సరఫరా చేస్తుండడంతో ప్రాణాలు ఫణంగా పెట్టి సాగు చేయాల్సి వస్తుందని రైతులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా చంద్రుగొండలో జరిగింది. చండ్రుగొండ మండల కేంద్రం లోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆదివారం ఆందోళన చేశారు. శనివారం రాత్రి పొలానికి నీళ్లుపెట్టేందుకు వెళ్లిన ఓ రైతు చేలో కనిపించిన ఏడు అడుగుల కొండచిలువను హతమార్చిన రైతులు, ఆదివారం ఉదయం దాన్ని తీసుకొచ్చి సబ్‌స్టేషన్ ఎదు ట ఉంచి ధర్నా చేశారు. వ్యవసాయానికి పగ లే ఏడుగంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలోని పోకలగూడెం గ్రామానికి చెందిన రైతు బాణోత్ దేవదాస్ మిర్చి తోటకు నీళ్లుపెట్టేందుకు శనివారం రా్ర తి వెళ్లాడు. దారిలో అతనికి ఏడడుగుల కొండచిలువ కనిపించింది. తోటి రైతుల సహాయంతో దాన్ని హత మార్చాడు. వ్యవసాయానికి రాత్రి వేళ కరెంటు ఇవ్వడం మూలంగానే రైతులు అర్ధరాత్రి వేళ చేల వెంట వెళ్లాల్సి వస్తుందని, దీంతో ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని ఆరోపించారు. ఏడగుల కొండచిలువను చూడకుండా తొక్కి ఉంటే రైతు ప్రాణాలు గాలిలో కలిసేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం చండ్రుగొండ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా తాము చంపిన కొండచిలువ కళేబరాన్ని ఉంచి నిర్వహించారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు ఆందోళన నిర్వహించి విద్యుత్‌శాఖ ఏఈఈ వెంకన్నకు వినతిపత్రం సమర్పించారు. పోకలగూడెం, బాల్యతండా, వంకనంబర్, కరిశెలబోడు, వెంకటియాతండా, సామ్యతండాలకు చెందిన రైతులు గుగులోతు చందర్, బాణోత్ దేవదాస్, బాణోత్ హనుమ, లావు డ్యా బాలాజి, దారావత్ హర్య, వస్రాం, గుగులోతు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


