జైభీమ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

జైభీమ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

Mar 3 2026 9:16 AM | Updated on Mar 3 2026 9:16 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జైభీమ్‌ డైరీ, క్యాలెండర్‌ను సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. సరూర్‌నగర్‌ ఎస్‌ఈ లక్ష్మీనారాయణకు క్యాలెండర్‌ అందజేశారు. కార్యక్రమంలో సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యదర్శి పి.రవీందర్‌, ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, నాయకులు మహేందర్‌, అశోక్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

పహాడీషరీఫ్‌: గుట్టు చప్పుడు కాకుండా మూడు ముక్కలాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీలో గరడు రమేష్‌ (34), పవన్‌ (24), ఎల్లప్ప (60), సంతోష్‌ (22), కాశీరాం (22) సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పహాడీషరీఫ్‌ పోలీసులు దాడి చేసి, ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రెండు సెట్ల కార్డులు, ఒక సెల్‌ఫోన్‌, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌కు ఏడాది జైలు

రూ.6 వేల జరిమానా

పూడూరు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. చన్గోముల్‌ ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన తోక అంజలిదేవి నారాయణపేట్‌ బస్సులో హైదరాబాద్‌కు వెళ్తోంది. పూడూరు గేట్‌ సమీపంలో డ్రైవర్‌ అజాగ్రత్తగా బస్సు నడపుతూ మామిడి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా అంజలీదేవి అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటి ఎస్‌ఐ నాగరాజు 2015లో కేసు నమోదు చేసి కోర్డులో పత్రాలు దాఖలు చేశారు. వాదోప వాదనలు విన్న న్యాయమూర్తి నాగుల శిల్ప ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ హరికృష్ణ నాయక్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 వేలు జరిమానా విధించారు. ఈ కేసులో అధికారి శేఖర్‌ దర్యప్తు చేయగా ప్రస్తుత ఎస్‌ఐ భరత్‌రెడ్డి సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. ప్రభుత్వ తరపున ఏపీపీఓ సమీనాబేగం వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసులు శివకుమార్‌, తదితరులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement