న్యూస్‌రీల్
నిర్దేశిత సమయానికి ముందే చేరుకోవాలి
ఆల్ ద బెస్ట్
పరీక్ష కేంద్రాలపై పోలీసు నిఘా
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
పరీక్ష కావాలి..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 255 కేంద్రాలను ఎంపిక చేశారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన భద్రత మధ్య ప్రశాంతమైన వాతావ రణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులతో పది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు శుక్రవారం మొయినాబాద్ మండలం చిలుకూరు, అజీజ్‌నగర్ సహా పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
ఏప్రిల్ 16 వరకు వార్షిక పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఇదీ జిల్లా లెక్క
మొత్తం పాఠశాలలు 1,024
విద్యార్థులు 53,050
పరీక్ష కేంద్రాలు 255
ఇన్విజిలేటర్లు 2,200
ఫ్లయింగ్ స్క్వాడ్స్ 10
సిట్టింగ్‌స్క్వాడ్స్ 255
ప్రశ్నపత్రాల స్టోరేజీ పాయింట్లు 37
జవాబు పత్రాలు తరలించే పోస్టాఫీసులు 53
కస్టోడియన్స్ 74
ఏఎన్‌ఎం/స్టాఫ్ నర్సులు 255
సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్న వారు 1,108
సమయం: ఉదయం: 9.30 నుంచి మధ్యాహ్నం: 12.30
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ కోసం వాట్సాప్ నంబర్
80969 58096
ఉదయం 9.35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. హాల్‌టికెట్, పరీక్ష ప్యాడ్, బాల్ పెన్ను మర్చిపోవద్దు. వెంట మంచినీళ్ల బాటిల్ మినహా ఇతర ఎలక్ట్రానిక్(సెల్‌ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్‌లు, పెన్‌డ్రైవ్‌లు) వస్తువులకు అనుమతి లేదు. ప్రతి సెంటర్‌ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను కార్లలో కాకుండా బైకులు/స్కూటీలపై తీసుకొచ్చి, పరీక్ష రాసిన తర్వాత తీసుకెళ్లడం ఉత్తమం.
– సుశీందర్‌రావు, డీఈఓ
వార్షిక పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయొద్దు. చదువు పేరుతో నిద్రాహారాలు మాన్పించొద్దు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయించాలి. చివరి నిమిషంలో కలిగే ఆందోళన, చికాకులతో ఇప్పటికే వచ్చిన అంశాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత బాగా చదివితే అంతే బాగా సమాధానాలు రాయగలుగుతాం. ఆఖరి నిమిషంలో హడావుడి చేయ కుండా విద్యార్థులంతా నిర్దేశిత సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మొదటిసారిగా బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్.
– నారాయణరెడ్డి, కలెక్టర్
ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాం. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. జీరాక్స్ సెంటర్లు మూసివేయిస్తున్నాం. పేపర్ లీకేజీ పుకార్లను నియంత్రించేందుకు పోలీసులు మఫ్టీలో విధులు నిర్వర్తించనున్నారు. పోలీసు స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను ఆయా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసు ఎస్కార్ట్ బందోబస్తు ఏర్పాటు చేశాం. జవాబు పత్రాల తరలింపులోనూ ఇదే తరహా బందోబస్తు ఏర్పాటు చేశాం. మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల సహా పలు మండల కేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం.
– జి.సుధీర్‌బాబు, కమిషనర్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్


