షాద్‌నగర్: విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని ఐ సడక్ సంస్థ సీఈఓ రామన్ చెస బైడియా అన్నారు. ఐసడక్, జడ్చర్ల టోల్ ప్లాజా ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో బాత్‌రూంలు, దూసకల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్, పల్లె దవాఖానాలను నిర్మించారు. వీటిని సోమవారం సంస్థ సీఈఓ రామన్ చెస బైడియా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రామన్ చెస్ బైడియా మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి వాటిలో అత్యాధునిక సదుపాయాలను తమ సంస్థ నిధులను వెచ్చిస్తున్నామని చెప్పారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంఈఓ మనోహర్, సంస్థ ఆపరేషన్ ఆఫీసర్ మార్క్, హెచ్‌ఎంలు భాగ్యమ్మ, రేవతి, టోల్‌ప్లాజా మేనేజర్ ఇబ్రహీం, జగదీష్, కౌన్సిలర్ పెంటయ్య, సర్పంచ్ జ్యోతిర్మయి, ఉప సర్పంచ్ కుమార్, డాక్టర్ శ్వేత, ఉపాధ్యాయులు సంతోష, శ్రీనివాస్, సర్పరాజ్, శిరీష పాల్గొన్నారు.
ఐ సడక్ సంస్థ సీఈఓ రామన్ చెస బైడియా


