మంచాల: కుటుంబ కలహాలతో ఓ మహి ళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆరుట్లలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మంచాల సీఐ మధు తెలిపిన ప్రకారం.. గ్రామా నికి చెందిన జోగు సుదర్శన్‌తో ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సంధ్యారాణి (45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం. దంపతులు తరచూ గొడవపడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు సర్దిచెప్పారు. వారిలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన సంధ్యారాణి మంగళవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి పిల్లలు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు సుదర్శన్‌పై కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఇబ్రహీంపట్నం ప్రభు త్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం ఆరుట్లలో అంత్యక్రియలు నిర్వహించారు.
బెల్టుషాప్‌పై దాడులు
పహాడీషరీఫ్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్టుషాప్‌పై పహాడీషరీఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హార్డ్‌వేర్ పార్కులోని శివ కిరాణ జనరల్ స్టోర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు దాడులు చేయగారూ.17వేల విలువైన 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు శివకుమార్(32) అరెస్ట్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
వెంచర్ ప్రహరీకూల్చివేతపై కేసు
షాద్‌నగర్‌రూరల్: మున్సిపల్ పరిధి చటాన్‌పల్లి శివారులో ఉన్న ఆర్సిడో లారెల్ స్ప్రింగ్ వెంచర్ ప్రహరీని కూల్చారని వెంచర్ యజమాని మిట్టపల్లి యాదగిరి బుధవారం ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుశీల, బాధితుడు తెలిపిన ప్రకారం.. సర్వే నంబర్ 529పీ, 530పీ, 554పీ, 556పీ, 557పీ, 558లోని 28 ఎకరాలలో రెరా అనుమతులను తీసుకుని వెంచర్ చేశారు. సంబంధంలేని సర్వే నంబర్ 534లో తనకు భూమి ఉందని చటాన్‌పల్లికి చెందిన శివకుమార్, రాజుగౌడ్, రామకృష్ణ, భాస్కర్‌గౌడ్, రాజు, శ్రీశైలం, జంగయ్య, యాదగిరి, అశోక్, చెన్నయ్య, గిరి, రమేశ్, చిన్నచంద్రయ్య వెంచర్‌లోకి ప్రవేశించి ప్రహరీ కూల్చి వేశారు. ఆ వీడియోలు పంపి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేశారని తెలిపాడు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అన్నిశాఖలనుంచి అనుమతులను తీసుకున్న తరువాతనే వెంచర్‌చేసి గోడను నిర్మించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


