సీఐ విజయ్‌కుమార్‌ బదిలీ కొత్త సీఐగా సీతారాం | - | Sakshi
Sakshi News home page

సీఐ విజయ్‌కుమార్‌ బదిలీ కొత్త సీఐగా సీతారాం

Mar 5 2026 8:43 AM | Updated on Mar 5 2026 8:43 AM

షాద్‌నగర్‌ రూరల్‌: షాద్‌నగర్‌ పట్టణ సీఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఆయనను ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ బుధవారం ఆశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌కుమార్‌ ఇక్కడ దాదాపు 20 నెలల పాటు పనిచేశారు. ఇతని స్థానంలో కందుకూరు సీఐ సీతారాం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.

తాత్కాలిక నియామకాలకు దరఖాస్తులు

అనంతగిరి: జనాభా–2027 లెక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లాలో పొరుగు సేవల ప్రాతిపదికన(17 నెలల కాల పరిమితితో)సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకుంటున్నట్లు వికారాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ కార్యాలయం, 20 మండలాలు, 4 మున్సిపల్‌లలో పనిచేయటకు మొత్తం 26 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు (20 మండలాలకు ఒక్కొక్కటి, 4 మున్సిపల్‌లకు ఒక్కొటి చొప్పున, చీఫ్‌ ప్లానింగ్‌ కార్యాలయానికి 2 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 1 మల్టీ టాస్కింగ్‌ స్టాప్‌ పోస్టు భర్తీ చేయబడుతుందన్నారు. ఈ నియామకాలు ఈనెల 20 నుంచి 2027 జూన్‌ 30 వరకు ఉంటుందన్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ.25 వేలు, మల్టీ టాస్కింగ్‌ స్టాప్‌నకు నెలకు రూ.18వేలు కన్సాల్టెడ్‌ వేతనం చెల్లించ బడుతుందన్నారు. ఈ పోస్టులకు కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ, నిమిషానికి 25–30 పదాల టైపింగ్‌ వేగం, ఎంఎస్‌ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ అనుభవం, డిజిటల్‌ మొబైల్‌ అప్లికేషన్‌లపై పరిజ్ఞానం అవసరమన్నారు. అర్హులైన వారు తమ బయోడెటాను అన్ని ధ్రువపత్రాలతో కలిపి 2 సెట్ల జిరాక్స్‌ కాపీలను వికారాబాద్‌లోని మెప్మా కార్యాలయంలో ఈనెల 7వ తేది సాయంత్రం 5గంటలలోపు ఇవ్వాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9177933822, 9398003089లో సంప్రదించాలన్నారు.

టిప్పర్‌ బోల్తా

డ్రైవర్‌కు గాయాలు

ధారూరు: టిప్పర్‌ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన ధారూరు – గట్టెపల్లి బస్‌స్టేజ్‌ మధ్య బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ నుంచి కంకర లోడుతో టిప్పర్‌ తాండూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున ధారూరుకు రాగానే బారికేడ్‌ను ఢీకొట్టింది. వంద మీటర్ల వరకు వాహనం అలాగే వెళుతుండటంతో పోలీసులు గమనించి వెంబడించారు. అయినా వాహనం ఆపకుండా తాండూరు వైపు వేగంగా వెళ్లింది. సోమశంకరప్ప గుడి దాటిన తర్వాత రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి గుంతలో పల్టీ కొట్టింది. డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుకు ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement