సన్మానం
జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్ రావు ఉద్యోగ విరమణ చేశారు. సరోర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అధికారులు, క్రీడాకారులు ఆయనను ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిత, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోచ్‌లు, సిబ్బంది, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
– హుడాకాంప్లెక్స్


