ప్రజాపాలన ప్రగతిపై అలసత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన ప్రగతిపై అలసత్వం

Mar 10 2026 1:27 PM | Updated on Mar 10 2026 1:27 PM

షాద్‌నగర్‌రూరల్‌: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విధుల పట్ల అలసత్వంగా వహించిన పంచాయతీ కార్యదర్శిపై డీపీఓ సురేశ్‌మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బూర్గుల, కాశిరెడ్డిగూడ గ్రామ పంచాయితీలను ఆయన స్థానిక ఎంపీడీఓ బన్సీలాల్‌, ఎంపీఓ జయంత్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులు, తడిచెత్త, పొడి చెత్త, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. కాశిరెడ్డిగూడలో పల్లె ప్రకృతి వనం నిర్వహణ సక్రమంగా లేకపోవడం, బూర్గుల డంపింగ్‌యార్డులో పశువులను కట్టివేయడంతో డీపీఓ కార్యదర్శి వాసవాచారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. తూతూ మంత్రంగా కార్యక్రమాలను చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం రూ.కోట్ల ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి నివేదికను అందించనున్నట్లు డీపీఓ సురేశ్‌మోహన్‌ తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

బూర్గుల పంచాయతీ కార్యదర్శిపై డీపీఓ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement