మొయినాబాద్‌రూరల్: మండల పరిధిలోని కనకమామిడి చౌరస్తా సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ పగలడంతో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాగునీరు ఏరులై పారుతుంది. సోమవారం రోడ్డు నిర్మాణంలో జేసీబీతో మట్టిని తీస్తుండడంతో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరంతా రోడ్డుపై ప్రవహించింది. దీంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాదారులు ఈ వరద నీటిలో ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పను లు నిర్వహిస్తున్న సిబ్బంది అధికారులకు తెలపడంతో వెంటనే మిషన్ భగీరథ పైపులైన్ మర మ్మతు పనులు నిర్వహించారు.


