అదుపు తప్పి.. కిందపడి | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి.. కిందపడి

Mar 10 2026 1:27 PM | Updated on Mar 10 2026 1:27 PM

బైక్‌ ప్రమాదంలో ఒకరి మృతి

శంకర్‌పల్లి: ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పర్వేద అనుబంధ గ్రామమైన లచ్చిరెడ్డి గూడకు చెందిన ఖలీల్‌ (45) శంకర్‌పల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా మంచర్లగూడెం వద్ద బైక్‌ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement