క్రీడారంగ అభివృద్ధే కేంద్రం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడారంగ అభివృద్ధే కేంద్రం లక్ష్యం

Mar 10 2026 1:27 PM | Updated on Mar 10 2026 1:27 PM

షాద్‌నగర్‌: క్రీడా రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని ఏబీ ఫంక్షన్‌ హాల్‌లో ప్రధాన్‌ మంత్రి సంసద్‌ ఖేలో క్రీడా పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను పోటీల నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా బాబయ్య మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఆలోచనలతో సంసద్‌ ఖేలో కార్యక్రమం ప్రారంభం అయ్యిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో ఉన్న క్రీడా ప్రతిఽభను వెలికి తీసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. సంసద్‌ ఖేలో కార్యక్రమంలో భాగంగా పాలమూరు పార్లమెంట్‌ పరిధిలో క్రీడాకారులకు కబడ్డీ, క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో వంటి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లు పైబడిన యువకులు ఈ పోటీల్లో పాల్గొన వచ్చని తెలిపారు. మార్చి 24 వరకు క్రీడాకారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఏప్రిల్‌ 9 నుంచి 24 వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్‌గౌడ్‌, మురళీ, శ్రీను, శ్రీనివాస్‌చారి, మోహన్‌సింగ్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, అశోక్‌, లష్కర్‌ నాయక్‌, మహేందర్‌రెడ్డి, రాజు, అరవింద్‌, రుషికేష్‌, సుధాకర్‌, మహేష్‌, రాజేశ్వరీ, రఘు, రామకృష్ణ, అనిల్‌గౌడ్‌, ప్రశాంత్‌, ప్రవీణ్‌, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement