రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన
శంకర్‌పల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోకిల సీఐ వీరబాబు అన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఠాణాలో ప్రైవేటు పాఠశాల రవాణా ఇన్‌చార్జీలతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి నిత్యం బస్సులు నడిపేందుకు వచ్చే డ్రైవర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, అదే విధంగా బస్సులను ఎప్పటికప్పుడూ తనిఖీ చేయిస్తూ ఉండాలన్నారు. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు కోటేశ్వర్‌రావు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


