పరిగి: పదవులకు దూరంగా ఉన్న బంజారులకు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కల్పించేందుకు చొరవతీసుకోవడం హర్షణీయమని బంజార రాష్ట్ర నాయకులు అన్నారు. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ హన్మంత్‌ను ఆదివారం బంజార ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజార నాయకుడికి అవకాశం రావ డం సంతోషించదగిన విషయమన్నారు. హన్మంతు భవిష్యత్‌లో మరిన్న పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాంగ్యనాయక్, వెంకట్, హరిలాల్, రూప్‌సింగ్, మాంగ్య, రాకేశ్, రెడ్యా, శ్రీను పాల్గొన్నారు.


