దుద్యాల్: ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నాణ్యత నియంత్రన ఎస్‌ఈ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్ శివారులో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ హబ్‌లో కొనసాగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా స్కూల్, వెటర్నరీ ఆస్పత్రి, సైనిక్ స్కూల్‌కు సంబంధించిన హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ కేఎల్‌ఎస్‌ఆర్ ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఎడ్యుకేషన్ హబ్ సుపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ విజయవర్ధన్ రెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ ఈఈ నాగేశ్వర్ రావు, రాజయ్య, ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఈ సుదర్శన్ రెడ్డి


