ఒకరికి తీవ్ర గాయాలు
చేవెళ్ల: రెండురోజుల్లో పెళ్లి ఉందని స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు వచ్చి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌లారీ ఢీకొన్న ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన బస్వ ప్రవీణ్ నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 5న తన వివాహం ఉండటంతో చేవెళ్లలోఉన్న స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు మంగళవారం కారులో వచ్చి తిరిగి వెళ్తున్నాడు. మార్గమధ్యలో మీర్జాగూడ సమీపంలో కి రాగానే రోడ్డు పనులకు మట్టిపోస్తున్న టిప్పర్ లా రీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. మరో కారు వెనుక నుంచి వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కారులో ఇరుక్కుపోయాడు. అతన్ని స్థా నికులు బయటకు తీసి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి త రలించారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


