లారీ చక్రాల కింద నలిగి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ చక్రాల కింద నలిగి మహిళ మృతి

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

లారీ చక్రాల కింద నలిగి మహిళ మృతి

లారీ చక్రాల కింద నలిగి మహిళ మృతి

మరో వ్యక్తికి గాయాలు

బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం

అబ్దుల్లాపూర్‌మెట్‌: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తార్నాక మాణికేశ్వర్‌కాలనీ వడ్డెరబస్తీకి చెందిన గండికోట లలిత (41) వృత్తిరీత్యా కూలీ. శనివారం ఉదయం మేసీ్త్ర లింగస్వామితో కలిసి పనికోసం తార్నాక నుంచి బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్‌ వెళ్తున్నారు. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ గేటు వద్ద విజయవాడ మార్గం నుంచి వస్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి, వీరి బైక్‌ను ఢీకొట్టింది. రోడ్డు పక్కన పడిపోయిన లలిత తల పైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. లింగస్వా మి గాయపడ్డారు. మృతురాలి సోదరుడు యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారామ్‌ తెలిపిన వివరాలు.. కడ్తాల్‌ మండలం గోవిందపల్లికి చెందిన కంబాలపల్లి అంజయ్య(38), భార్య సువర్ణ, పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తుమ్మలూరు పరిధిలోని బీటీఆర్‌లో కూలీ పనులు చేయడానికి వెళ్లిన సువర్ణను తీసుకువచ్చేందుకు శుక్రవారం రాత్రి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో దెబ్బడగూడ గేట్‌ వద్ద శ్రీశైలం రహదారిపై ఎదురుగా వచ్చిన కారు అంజయ్య బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ పరమేశ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement