కడ్తాల్: యువత వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలని కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోర్పోలు లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్‌సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్విరాన్‌మెంట్ ఓరియంటేషన్ కార్యక్రమానికి కాచిగూడ భద్రుక డిగ్రీ కళాశాలకు చెందిన 104 మంది విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదర్‌ట్రీకి పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పర్యావరణవేత్తలు డాక్టర్ తులసీరావు, డాక్టర్ నారాయణరావు, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, భద్రుక కళాశాల ప్రొఫెసర్స్ డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ సుష్మాదేవి, డాక్టర్ శృతి, మహేందర్, సీజీఆర్ సిబ్బంది పాల్గొన్నారు.


