కందుకూరు: రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురైయింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తగూడ చౌరస్తా నుంచి కొత్తగూడ గ్రామానికి వెళ్లే రహదారి పక్కన సామ సుదర్శన్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న 16 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తరలించుకుపోయారు. ఉద యం విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటుతో
మాజీ సర్పంచ్ మృతి
ఇబ్రహీంపట్నం: మండలంలోని శేరిగూడ మాజీ సర్పంచ్, ఉత్తమ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత ఎదుళ్ల కృష్ణారెడ్డి(73) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుతూళ్లు ఉన్నారు. గ్రామానికి 1981 నుంచి 1995 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డితోపాటు పలువురు నేతలు మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
● పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప
పరిగి: మహిళలు వంటింటికి పరిమితం కారాదని, అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానంలో నిలవాలని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప సూచించారు. మంగళవారం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మహిహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీ్త్ర అంటే శక్తి అని.. సీ్త్ర ఉంటేనే కుటుంబ, దేశం, ప్రపంచం బాగుంటుందన్నారు. అన్ని రంగాల్లో రాణి స్తేనే మహిళలకు గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, కమిషనర్ వెంకటయ్య, ఎంపీడీఓ కరీం, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకా శ్, కౌన్సిలర్లు బాదం అఖిల, హబీబ్‌ఉనిసా, షాహేదాబేగం తదితరులు పాల్గొన్నారు.


