షాద్‌నగర్‌రూరల్: పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏపీఎం జయమాలిని అన్నారు. మంగళవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఏపీఎం జయమాలిని ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య భవనం పరిసరాలలోని చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయించారు. అదేవిధంగా మండల మహిళా సమాఖ్య భవనంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, కార్యదర్శి సులోచన, కోశాధికారి అలివేలు, సీసీలు శివకుమార్, రాంచంద్రయ్య, మల్లేశ్, కృష్ణయ్య, యాదయ్య, విజయ, సరళ, డీఎంజీలు కృష్ణ, గిరి, గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, వీఓఏలు, సెర్ప్ సిబ్బంది, మండల సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎం జయమాలిని


