నవాబుపేట: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో 30 ఫీట్ల పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని అభివృద్ధి చేసుకోవాలని కార్యకర్తలకు సూ చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు చంద్రకాంత్, ఐటీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ శ్రీధర్, నాయకులు జగన్, గాలయ్య, శేఖర్, మల్లేశం, చంద్రశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భీంరెడ్డి, రత్నం, రాజశేఖర్ రెడ్డి, కల్యాణ్ రావు, రాంరెడ్డి, పద్మా రావు, జైపాల్ రెడ్డి, గోపాల్ గౌడ్ పాల్గొన్నారు.


