ఇబ్రహీంపట్నం: భూసార పరీక్ష కేంద్రాన్ని ఆధునీకరించి, బలోపేతం చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీసీ (ఆగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ కోఆపరేషన్), ప్రజాపాలన నోడల్ ఆఫీసర్ సురేంద్రమోహన్ తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణంలోని భూసార పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాయపోల్ పరిధిలోని రాయన్‌గూడ గ్రామంలోని డిజిటల్ క్రాప్ బుకింగ్‌ను ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఆధునిక పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. సబ్సిడీపై విత్తన కిట్, భూసార పరీక్ష కార్డులను అందజేశారు. రాయపోల్‌లో కూరగాయలు విక్రయించుకునేందుకు రైతులకు మార్కెట్ షెడ్‌ను నిర్మించాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీశైలం కోరారు. కార్యక్రమంలో డీఏఓ ఉష, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, ఏడీఏ సుజాత, భూసార పరీక్ష ల్యాబ్ ఏడీఏ మహేశ్వరి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, ఏఓ భవాని, విద్యాధరి, ఏఈఓ సృజన రైతులు పాల్గొన్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీసీ సురేంద్రమోహన్


