యాచారం: ఏళ్లుగా ఆ భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాం, అవి పోతే బతుకుదెరువు పూర్తిగా కోల్పోతాం.. న్యాయమైన పరిహారం అందజేసి ఆదుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డికి గిరిజన రైతులు మొర పెట్టుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వద్ద వ్యవసాయ భూములు కోల్పోతున్న మండలంలోని కుర్మిద్ద గ్రామ అనుబంధ గిరిజన తండాలైన మంగళిగడ్డ, మర్లకుంట తండాలకు చెందిన చెందిన రైతులు సోమవారం యాచారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ అనంత్‌రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్పతో కలిసి సమావేశమయ్యారు. సార్ ఎకరాకు రూ.కోటి వరకు పరిహారం ఇప్పించండి.. ఆ భూములు పోతే మేము జీవనోపాధిని పూర్తిగా కోల్పోతామని విన్నవించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులతో మాట్లాడి మెరుగైన పరిహారం అందజేస్తామని, కానీ రోడ్డు పనులు ఆపవద్దని రైతులకు సూచించారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఆర్డీఓకు మొరపెట్టుకున్న గిరిజన రైతులు


