షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల సాకారమైందని మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. ఇళ్ల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించినా.. అక్కడ పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సుమారు రూ.8 కోట్లు వెచ్చించి అన్ని ఇళ్ల సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి ఇళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు మురళీమోహన్, దిలీప్‌కుమార్, శ్రావణి, విశాల, రాజునాయక్, సంతోషిబాయి, ఎస్పీ శివ, మరియాబేగం, పెంటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక పనులు ప్రారంభం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని 18, 26 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ బస్వం పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం


