ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి

సాక్షి,రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కె. రాజేష్‌ రెడ్డి అన్నారు. షాబాద్‌ మండలం హైతాబాద్‌లో ఏర్పాటు చేసిన బుగ్గారెడ్డి క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజ లకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ ఐనాపురం అనురాగ్‌ రెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే సంకల్పంతో క్లినిక్‌ ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎలుగంటి మధుసూదన్‌ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పామెన భీమ్‌ భరత్‌, గుడిమల్కాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కావలి చంద్రశేఖర్‌, హైతాబాద్‌ సర్పంచ్‌ శాంతమ్మ, ఉపసర్పంచ్‌ హిర్సా నాయక్‌, షాబాద్‌ సర్పంచ్‌ అశోక్‌, ఉపసర్పంచ్‌ రాహుల్‌ తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement