మర్పల్లి: ఉల్లి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. పెట్టుబడి డబ్బు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన మినుము, పెసర, సోయాబీన్ వంటి పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాల రైతులు సుమారు 600 ఎకరాల్లో యాసంగి పంటగా బావులు, బోర్ల కింద ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.60 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టారు. 80 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. ఆశించిన మేర దిగుబడి వచ్చి నా ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాలు ఉల్లిపాయల బస్తా రూ.700 ఉందని తెలిపారు. నాట్లు, రవాణ, కూలీల ఖర్చులకే సరిపో యిందని వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతుఽ ధర రూ.2 వేలు ప్రకటించాలని కోరారు.


