కందుకూరు: మండల పరిధిలో కొనసాగుతున్న ఉల్లాస్ కార్యక్రమాన్ని ఢిల్లీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఉల్లాస్ రాష్ట్ర డైరెక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ అనిత ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జైత్వారం, సాయిరెడ్డిగూడ, గుమ్మడవెల్లి, గుమ్మడవెల్లి తండాల్లో పర్యటించి ఉల్లాస్ పథకం కింద అందుతున్న వయోజన విద్య తీరును పర్యవేక్షించారు. ఎంత మంది విద్య నేర్చుకునేందుకు వస్తున్నారు తదితర వివరాలు అడిగితెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేస్తున్న ఉపాధ్యాయులు, వీఓఏలు, విలేజ్ టీచర్లును అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ నర్సింహ, ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


