యువతి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Mar 7 2026 10:11 AM | Updated on Mar 7 2026 10:11 AM

పహాడీషరీఫ్‌: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి గ్రామానికి చెందిన కెతావత్‌ లక్ష్మణ్‌ కుమార్తె నీలా (24) ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 5న ఉదయం కుటుంబ సభ్యులు పనికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఫోన్‌ సైతం స్విచ్ఛాఫ్‌ వచ్చింది. శుక్రవారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్‌ 4వ వార్డులో శుక్రవారం రాత్రి ముస్లింలకు వార్డు కౌన్సిలర్‌ బక్కరెడ్డి మాధవియాదిరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతావెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బండారి శైలజ, నాయకులు బక్కరెడ్డి రవీందర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌, రవిందర్‌, మోసిన్‌, జాఫర్‌, ఉమ్మర్‌, సర్దార్‌, యాసిన్‌, శివరాజ్‌, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్‌, యాదయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement