బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Mar 13 2026 9:04 AM | Updated on Mar 13 2026 9:04 AM

శంకర్‌పల్లి: స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా గురువారం మీర్‌ ముదస్సర్‌ అలీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన వెయింటింగ్‌ లిస్ట్‌లో ఉండగా.. తాజాగా ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుధీర్‌ బాబు శంకర్‌పల్లి ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ పని చేస్తున్న శ్రీనివాస్‌ గౌడ్‌ని కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్స్‌ విభాగానికి బదిలీ చేశారు. ఠాణాలో శాంతి భద్రతలను కాపాడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అదే విధంగా ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు విసృత్తంగా అవగాహన కల్పించనున్నట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ముదస్సర్‌ అలీ పేర్కొన్నారు.

మట్టి టిప్పర్ల పట్టివేత

ఇబ్రహీంపట్నం రూరల్‌: అర్ధరాత్రి మట్టి తరలించే టిప్పర్లను ఆదిభట్ల పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రవికుమార్‌ వివరాల మేరకు.. రావిర్యాల సమీపంలో ఓ ప్రభుత్వ భూమిలో జేసీబీల సహాయంతో టిప్పర్లల్లో మట్టి నింపి అక్రమంగా తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు జరిపి.. నాలుగు మట్టి టిప్పర్లు, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌ వైజర్‌ సస్పెన్షన్‌

దుండిగల్‌: దుండిగల్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌ వైజర్‌ (టీపీఎస్‌) సంజనను సస్పెండ్‌ చేస్తూ కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌ పింకేశ్‌ కుమార్‌ లలిత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న దుండిగల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టౌనన్‌్‌ ప్లానింగ్‌ విభాగంలో సంజన అవినీతికి పాలడినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement