వర్షాకాలం కంటే తక్కువ
బోరు కింద వర్షాకాలం దాదాపు మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. బోర్లలో నీటి శాతం పెరిగిన వేసవి ఎండల కారణంగా భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. నీటి లభ్యతని బట్టి సాగు చేశా. నెల రోజు క్రితమే నాటు వేశాను. ప్రస్తుతం పిలకు వచ్చి పంట బాగుంది.
– ఈరప్ప, రైతు, హస్నాబాద్
అధిక వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండుకోవడంతో బోర్లలో నీరు పెరిగి యాసంగి వరి సాగు శాతం పెరిగింది. ప్రస్తుతానికి 93,116 ఎకరాల వరకు వరి నాటు పూర్తయ్యాయి. దాదాపుగా 1,05,000 ఎకరాల వరకు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. రైతులు యాజమన్య పద్ధుతులు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చు. సందేహాలు, సలహాలు, సూచనల కోసం ఆయా గ్రామాల వారీగా ఏఈఓలను సంప్రదించాలి.
– రాజారత్నం, జిల్లా వ్యవసాయ అధికారి
వర్షాకాలం కంటే తక్కువ


