పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన ఫాతిమా బేగం(45) భర్త ఖురేషీ చనిపోవడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. శాసీ్త్రపురంలో నివసించే ఆమె సోదరుడు ముస్తఫా నిత్యం ఆహారం తెచ్చిస్తుంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆమె 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్: ఓఆర్‌ఆర్‌పై కారులో ప్ర యాణిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితి లో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్‌రోడ్డుపై పెద్దఅంబర్‌పేట నుంచి బొంగ్లూర్ వెళ్లే మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు ఆగి ఉండడాన్ని గమనించి న పెట్రోలింగ్ సిబ్బంది దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కారులో డ్రైవింగ్ సీటు పక్కనే ఉన్న సీ టులో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు నోట్లో నుంచి నురగ రావడాన్ని గ మనించి 108 వాహనానికి సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అతని వివరాల గురించి ఆరా తీయగా మృతుడు ఎన్టీఆ ర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం వేడ మనూరు గ్రామానికి చెందిన తడపనేని శివరామకృష్ణ(33) అని తేలింది. ఆయన గచ్చిబౌ లిలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


