వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి

Mar 2 2026 8:43 AM | Updated on Mar 2 2026 8:43 AM

వేగం

వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి

వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి

వికారాబాద్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారి

దుద్యాల్‌ మండలంలో సుడిగాలి పర్యటన

దుద్యాల్‌: నిర్మాణ పనుల్లో వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని దుద్యాల్‌, హకీంపేట్‌ గ్రామాల్లో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా దుద్యాల్‌లో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత భవనాలను పరిశీలించారు. లక్ష్యం మేరకు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులను పెండింగ్‌లో ఎందుకు పెట్టారని ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రశ్నించారు. హకీంపేట్‌ శివారు ఎడ్యుకేషన్‌ హబ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. సంబంధిత మ్యాప్‌ను పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి

కొడంగల్‌: నిధులు మంజూరైన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో వికారాబాద్‌, నారాయణపేట జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిచారు. కొడంగల్‌, నారాయణపేటకు సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్‌, తాగునీరు, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లు, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ, టీజీఈడబ్ల్యూడీసీ, పబ్లిక్‌ హెల్త్‌ శాఖల ద్వారా మంజూరైన నిర్మాణ పనులు ప్రారంభించి లక్ష్యం మేరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి.. సమ్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆర్‌అండ్‌బీ ద్వారా చేపట్టే పనులు, వెటర్నరీ, వైద్య కళాశాలలకు సంబంధించిన పనులు వేగిరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చెప్పారు. అంతకుముందు కడా ప్రకత్యేకాధికారి వెంకట్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌చౌదరి, పంచాయతీరాజ్‌ డీఈ సుదర్శన్‌, ఆర్‌అండ్‌బిబీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ రవిప్రసాద్‌, కొడంగల్‌, నారాయణపేట ఇంజనీరింగ్‌ విభాగం ఈఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి 1
1/1

వేగం పెంచి లక్ష్యం పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement