108 సేవల్లో జాప్యం జరగొద్దు | - | Sakshi
Sakshi News home page

108 సేవల్లో జాప్యం జరగొద్దు

Mar 12 2026 9:09 AM | Updated on Mar 12 2026 9:09 AM

108 సేవల్లో జాప్యం జరగొద్దు మొయినాబాద్‌: అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలందించడంలో ఎలాంటి జాప్యం జరగొద్దని జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ షేక్‌ జాన్‌ షాహిద్‌ అన్నారు. మొయినాబాద్‌లో 108 సేవలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో పనిముట్లు, మందులు సరిగా ఉన్నాయా అని ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితికి సంబంధించి సమాచారం అందిన వెంటనే స్పందించాలని.. అంబులెన్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తగిన చికిత్స అందించి.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలన్నారు. 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొయినాబాద్‌ 108 సిబ్బంది శ్రీకాంత్‌, రాజేశ్‌, రాజబాబు పనితీరును అభినందించారు. వెలుగుమట్ల బాధిత కుటుంబాలను ఆదుకోవాలి కందుకూరు: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నివాసం ఉంటున్న పేద కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు కె.శివశంకర్‌ కోరారు. ఈమేరకు బుధవారం వారు కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ కె.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నివసించే నిరుపేదల ఇళ్లు కూల్చివేయడం దారుణమన్నారు. బాధితుల పక్షాన జాగృతి పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో జాగృతి సభ్యులు రాయకంటి జగన్‌, ఎ.శ్రీశైలం, విజయభార్గవరెడ్డి, వీరేశ్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి కేశంపేట: పంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్మికులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. జీపీ వర్కర్స్‌కు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా జీతాలను చెల్లించాలని కోరారు. మూడు నెలలుగా వేతనాలు రాక వర్కర్స్‌ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, మండల అధ్యక్షుడు రవి, కొప్పు జంగయ్య, యాదయ్య పాల్గొన్నారు. గవర్నర్‌ను కలిసిన ఆచారి

జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ షేక్‌ జాన్‌ షాహిద్‌

జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి

జీపీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి

ఆమనగల్లు: రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డిని సైతం ఆచారి కలిసి ఆత్మీయంగా పలకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement