తుర్కయంజాల్: ఆదిబట్ల సర్కిల్ పరిధి సాగర్ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి మీదుగా తొర్రూర్ వరకు రోడ్డు వెంట వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డిప్యూటీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మునగనూర్‌లోని అనేక కాలనీల్లో వీధి దీపాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రేడియం స్టిక్కర్‌లు, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి డీసీ సానుకూలంగా స్పందించినట్లు నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, కృష్ణ, శేఖర్ రెడ్డి, భరత్‌రెడ్డి, అనిల్, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.


