పురుగు మందు తాగి వ్యక్తి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి వ్యక్తి బలవన్మరణం

Mar 14 2026 10:20 AM | Updated on Mar 14 2026 10:20 AM

శంకర్‌పల్లి: పురుగు మందు తాగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్‌ అలీ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలలోని రావులపల్లి గ్రామానికి చెందిన పాల యాదయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకి భార్య, కొడుకు ఉన్నారు. కూతురికి ఏడాది క్రితం వివాహం చేశాడు. కూతురు వివాహ సమయంలో కొంత మేర అప్పు చేసి విడతల వారీగా చెల్లిస్తున్నాడు. కొన్ని నెలలుగా చెల్లింపులలో ఇబ్బందులు తలెత్తడంతో.. ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన యాదయ్య గురువారం శంకర్‌పల్లికి వచ్చి పురుగు మందు డబ్బాని కొనుగోలు చేసి, రాత్రి పొలం వద్దకు వెళ్లి అక్కడే నిద్రించాడు. ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని పిలిచారు. అప్పుడే పొలం వద్ద పురుగుల మందు తాగిన యాదయ్య, వెంటనే ఇంటికి వెళ్లి, వాంతులు చేసుకున్నాడు, కుటుంబసభ్యులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పాడు. వెంటనే హుటాహుటినా సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. చికిత్స పొందుతున్న ఆయన మధ్యా హ్నం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

చికిత్స పొందుతూ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement