ప్రగతి ప్రతీ గడపకు చేరాలి | - | Sakshi
Sakshi News home page

ప్రగతి ప్రతీ గడపకు చేరాలి

Mar 12 2026 9:09 AM | Updated on Mar 12 2026 9:09 AM

ప్రగతి ప్రతీ గడపకు చేరాలి

మాడ్గుల: ప్రగతి ప్రతీగడపకు చేరాలని జిల్లా పరిషత్‌ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కోల్కులపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో వార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌ ఫైళ్లను యుద్ధ ప్రాతిపదికన క్లియర్‌ చేసి ఆ సమాచారం లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వినయ్‌ సాగర్‌, ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్‌ బట్టు అనురాధ, వార్డు సభ్యులు, మండల అధికారులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement