ఆర్థికాభివృద్ధికి సమన్వయం ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధికి సమన్వయం ముఖ్యం

Mar 12 2026 9:10 AM | Updated on Mar 12 2026 9:10 AM

యాచారం: ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు, ప్రభుత్వ విభాగాల మధ్యన సమన్వయం ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్‌ కె.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యాప్తంగా బ్యాకింగ్‌ కార్యకలాపాల పురోగతి, వివిధ ప్రభుత్వ ప్రయోజిత పథకాల అమలుపై ఆయన లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, జిల్లా సంప్రదింపుల కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ అడ్వాన్స్‌లు, విద్యారుణాల పంపిణీలో బ్యాంకుల, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా వివిధ రుణ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ పద్దుల కింద దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందజేసే విధంగా సహకరించాలని సూచించారు. మంజూరు, పంపిణీని నిర్ధారించడానికి బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆర్థిక చేరికను పెంచడానికి కృషి చేయాలని తెలిపారు. రుణ ప్రాసెసింగ్‌ను క్రమబద్ధీకరించడానికి క్రెడిట్‌ డెలివరీ అడ్డంకులపై చర్చించారు. అదే విధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా సంభావ్య క్రెడిట్‌ ప్రణాళికను సమావేశంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement