మంచాల: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న డిజిటల్ తరగతులు, ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి బోధన తీరు ఎలా ఉందో తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీలో మెనూ పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఇందుకు విద్యార్థులు బాగుందని చెప్పారు. ఉపాధ్యాయులు, పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడి పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న పాఠశాలకు.. ప్రస్తుతం మార్పు ఎలా ఉందని తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు తీసుకువస్తే నిరుపేదలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ పాఠశాల నిర్వహణ తీరు బాగుందని కితాబిచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలో హుజూర్‌నగర్‌లో ఇదే తరహా పాఠశాలను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్, చంద్రారెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, హౌసింగ్ పీడీ చంపానాయక్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, తహసీల్దార్ వెంకట ప్రసాద్, హెచ్‌ఎం గిరిధర్ గౌడ్, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి రాక?
ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏప్రిల్ 10 లేదా 12వ తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 3న నగరంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ గురించి మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుతో విద్యారంగంలో మరింత మార్పు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి బుధవారం ఆరుట్ల పర్యటనతో సీఎం వసార్తనే విషయానికి మరింత బలం చేకూరుతోంది.
సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి


